సాధిద్దాం

 



సాధిద్దాం

********

తల్లో పేలుచేరితే అది

ఆక్రమిత శిరస్సుఅని

హింసనోర్పుతో సహించిందని

మకుటాన్ని విధవముసుగని

పిరికికవిపందులు కొన్ని

మురికితిని రాసేశాయ్


కుంకుమపూదోట కాశ్మీరగడ్డతో

దేశమాతనుదుట 

శాశ్వతసుందరబొట్టెట్టేందుకై


కూంబింగ్ మొదలెట్టింది

భారత్దేశ సైన్యపౌరుషం 

పుత్రశోకం తీర్చటంకోసం

తల్లినిశాంతింపచేయటం కోసం


ప్రధాన సింహమంత్రాంగం పై 

నీచకుతంత్రపు వలలేసేందుకు 

తోడేళ్ళకూటమిపొంచివస్తోంది


యుద్ధంచేయలేని

వాడినాల్కలు 

శుభం పల్కట్లేదు పర్లేదు కానీ..

శత్రుదేశీ పియ్య భోంచేస్తూ

వ్యంగ్యాలతో వీరుల్నికృంగదీస్తున్నాయ్ 


ఆపేస్తే క్షమిద్దాం

ఆపకుంటే తృణీకరిద్దాం


జన్మభూమికై

ఐక్యంగా నిలుద్దాం


యుద్ధవ్యూహమైనా 

బుద్ధబోధనైనా 

మానవసమాజశాంతికై సాగిద్దాం

సంకల్పసిద్ధిసాధిద్దాం


గాదిరాజు మధుసూదనరాజు

Comments